• Home
  • Telugu
  • Interview Tips
  • బేసిక్ హౌస్ కీపింగ్ ఇంటర్వ్యూ ప్రశ్నలు మరియు సమాధానాలు

బేసిక్ హౌస్ కీపింగ్ ఇంటర్వ్యూ ప్రశ్నలు మరియు సమాధానాలు

Housekeeping interview q&a

హౌసెకీపర్లు శుభ్రపరచడం మరియు ఏదైనా భద్రతా ప్రమాదాలను ఇంటి యజమాని లేదా మేనేజర్‌కు నివేదించడం బాధ్యత వహిస్తారు. హౌసెకీపర్లు గృహాలు అలాగే కార్యాలయాలు, హోటళ్లు మరియు ఆసుపత్రులు మొదలైన వాణిజ్య భవనాల నిర్వహణకు అవసరమైన లైట్ క్లీనింగ్‌ను నిర్వహిస్తారు. 

1. మీరు రోజుకి ఎన్ని సార్లు చేతులు కడుక్కుంటారు? మీకు శుభ్రత గురించి అవగాహనన ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నంలో ఈ ప్రశ్న అడగ బడుతుంది . 
Ans. అభ్యర్థి రోజుకి ఐదు లేదా ఆరు సార్లు చేతులు కడుక్కుంటాను అని చెప్తాడు . 

2. మీరు ఒక నెలలో ఎన్ని రోజులు సెలవలు తీసుకుంటారు ? మీరు చెప్పే నెంబర్ అఫ్ డేస్ లీవ్స్ , మీరు తీసుకోబోయే లీవ్స్ ఒకటేనా కాదా . మీరు చెప్పే మాట మీద మీరు నిలబడతారు లేదా అని తెలుసుకునే ప్రయత్నంలో ఈ ప్రశ్న అడగ బడుతుంది. 
Ans. అభ్యర్థి వర్కులో రేగులర్గా ఉంటాడు అని, అత్యవసరం అయిన రోజుల్లో మాత్రమే తాను ఒకటి లేదా రెండు రోజులు సెలవు కోరుకుంటాడు అని చెప్తాడు . 

3. మీరు వీకేండ్స్లో కూడా పని చేయగలరా ? ఒకవేళ అవసరం అయితే మీరు శనాది వారాలు కూడా పని చేయగలరా లేదా అని తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడుగుతారు. 
Ans. అభ్యర్థి అలాగే అని చెప్తాడు . 

4. ఒకవేళ ఏదైనా విలువైన వస్తువు మీ చేతికి దొరికితే ఎం చేస్తారు? మీ నిజాయితీ చెక్ చేయడం కోసం ఈ ప్రశ్న అడగవచ్చు . 
Ans. అభ్యర్థి జాగ్రత్తగా మీకు తిరిగి ఇస్తాను అని చెప్తాడు . 

5. మీరు ఇంతకుముందు ఎక్కడ పని చేసేవారు ? 
Ans. అభ్యర్థి అపార్టుమెంట్లో అని చెప్తాడు . మీరు హౌస్ కీపింగ్ కాక ఇంకేం పనులు చేయగలరు ? 

6. ఒకవేళ అవసరం అయిందనుకోండి మీరు హౌస్ కీపింగ్ కాక ఇంకేం పనులు చేయగలరు అని తెలుసుకునే ప్రయత్నంలో ఈ ప్రశ్న అడగవచ్చూ . ఒకవేళ మీరు చేయగలను అని చెప్పిన పనులే మిమ్మల్ని చేయమంటే మీకు చాల తేలిక అయిపోతుంది. ఎందుకంటే మీకు ముందే ఆ పనులు వచ్చు కదా . 
Ans. అభ్యర్థి ఇల్లుతుడవడం, గిన్నెలు తోమడం మరియు బట్టలు పిండడం కూడా చేయగలను అని చెప్తాడు . 

7. మీకేవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా
Ans. అభ్యర్థి లేవు అని చెప్తాడు . 

8. మీరు ఎంత జీతం కావాలి అని అనుకుంటున్నారు ? 
Ans. అభ్యర్థి పదివేలు అని చెప్తాడు . 

9. మీరు ఎప్పటి నుండి ఆఫీస్ చేరగలరు ? 
Ans. అభ్యర్థి వచ్చే నెల ఒకటో తారీకు నుండి చేరగలను అని చెప్తాడు . 

10. ఒకవేళ ఎవరైనా సెలవు పెట్టారు అని అనుకుంటే వారి బదులుగా నువ్వు పని చేయగలవా ? ఒకవేళ మీ సమాధానం అవును అనుకోండి మీరు చాల సేఫ్ జోన్లో ఉన్నట్టు .అంటే ఇంటర్వ్యఆర్ కి మీ సమాధానం నచ్చ్చినట్టే కదా. 
Ans. అభ్యర్థి తప్పకుండ అని చెప్తాడు. 

11. పండగ రోజులల్లో మీరు కొంచం ఎక్కువ సేపు పని చేయగలరా ? 
Ans. అభ్యర్థి హాఫ్ డే రాగలను అని చెప్తాడు . 

12. మీ హబ్బీస్ ఏంటి ? 
Ans. అభ్యర్థి వంటచేయడం మరియు గార్డెనింగ్ అని చెప్తాడు . 

13. మీరు ఎక్కడ ఉంటారు ? మీరు గనక దూరంగా ఉంటున్నట్లైతే రోజు ఆలస్యంగా వచ్చే ఛాన్సెస్ తప్పక ఉంటాయికదా అందుకే మీరు ఎంత దెగ్గరలో ఉంటారో అని తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడగబడుతుంది . 
Ans. అభ్యర్థి ఇక్కడికి దెగ్గరలోనే ఉంటాను అని చెప్తాడు . 

14. మీ దెగ్గర టూ వీలర్ ఉందా ? ఒకవేళ ఏదైనా పని చెప్పారు అని అనుకోండి, మీరు టూ వీలర్ నడపాల్సివస్తే మీకు టూ వీలర్ నడపడం వచ్చ్చా రాదా అని తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడగవచ్చు. 
Ans. అభ్యర్థి వచ్చూ అని చెప్తాడు . 

15. హౌస్ కీపింగ్లో మీకు ఎన్నేళ్ల అనుభవం ఉంది ? మీకు ఎన్నేళ్ల అనుభవం ఉంది ఈ హౌస్ కీపింగ్ ఉద్యోగంలో అని ఎందుకు అడుగుతున్నారు అని అనుకుంటున్నారు . మీ ఎక్సపీరియెన్సుని బట్టే కదా మీ పని క్వాలిటీ ఉంటుంది . అందుకే ఈ ప్రశ్న అడగవచ్చూ. 
Ans. అభ్యర్థి ఆరు సంవత్సరాల అనుభవం ఉందీ అని చెప్తాడు . 

16. మీకు మొబైల్ ఉందా ? ఒక బేసిక్ మొబైల్ ఎల్లప్పుడూ మీదెగ్గర ఉండేలా చూసుకోండి . ఇది మీకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది . 
Ans. అభ్యర్థి ఉంది అని చెప్తాడు . 

17. పోలీస్ వెరిఫికేషన్ కోసం మీరు సిదంగా ఉన్నారా ? మీకు క్లీన్ రికార్డు ఉండ లేదా అని కచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకుంటారు అందుకే కచ్చితంగా ఈ పోలీస్ వెరిఫికేషన్ అనే విషయం వస్తుంది ఇంటర్వ్యూలో.
Ans. అభ్యర్థి కచ్చితంగా అని చెప్తాడు

18. మీకు ఈ హౌస్ కీపింగ్ జాబ్ ఎంత ముఖ్యమైంది ? మీకు కొన్ని బాధ్యతలు అంటూ ఉన్నాయా లేదా. వాటికోసమే కదండీ అందరు ఉద్యోగం చేసేది దాదాపు .ఈ విషయం తెలుసుకునే ప్రయత్నంలో ఈ ప్రశ్న అడగబడుతుంది . 
Ans. అభ్యర్థి అతను తనకు ఈ ఉద్యోగం చాల ముఖ్యమైనది. దీనిమీదే నా కుటుంబం అదరపది ఉంది . దీని వల్లనే నేను వారిని పోషించగలను అని చెప్తాడు . 

19. ఒకవేళ కొంచం ఎక్కువ సేపు పని చేయవలసి వస్తే మీరు సిద్ధంగా ఉన్నారా ? 
Ans. అభ్యర్థి అతను ఒక గంట అయితే పని చేయగలను అని చెప్తాడు . 

హౌస్కీపర్గా మీరు చేయవలసినవి: 

గృహనిర్వాహకులు, లేదా పనిమనిషి, ఆఫీస్ బిల్డింగ్స్ మరియు గృహాలను శుభ్రపరిచే పనిని నిర్వహిస్తారు. విజయవంతమైన హౌస్‌కీపర్‌గా ఉండాలంటే మీరు క్షుణ్ణంగా, సమర్థవంతంగా మరియు మర్యాదగా ఉండాలి. ఉద్యోగం యొక్క డిమాండ్లను తీర్చలేకపోతే లేదా ఒకటి కంటే ఎక్కువ పనులు చేయలేకపోతే, వేరే ఉద్యోగాన్ని ఎంచుకోండి. 

మీకు నచ్చిన ఏదైనా ఉద్యోగం కోసంEZJobs ను ఉపయోగించండి, మీకు నచ్చిన ఉద్యోగాన్ని పొందడంలో విజయం సాధించండి. 

మీరు EZJobs లో అనేక రకాల ఉద్యోగాలను పొందవచ్చు. హౌస్ కీపింగ్ కు సంబంధించి చాలా ఉద్యోగాలు ఉన్నాయి. చాలా మంది యజమానులు అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు. 

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *